హైదరాబాద్, ఏప్రిల్22 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ ఫలితాల్లో తెలంగాణ గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటారు. బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ సెకండియర్లో 83.17% మంది ఉత్తీర్ణత సాధించడంతోపాటు, 7649మంది ఏగ్రేడ్ సాధించారు. ఇంటర్ ఫస్టియర్లో 78.15% ఉత్తీర్ణత సాధించగా, 6798మంది విద్యార్థులు ఏగ్రేడ్ సాధించారు.
మొత్తంగా 11బీసీ గురుకుల కాలేజీలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని కాలేజీల్లో 71.37% ఉత్తీర్ణత నమోదైంది. ప్రతిభ చూపిన విద్యార్థులను మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ, ఎస్సీ గురుకుల సొసెటీల సెక్రటరీ సైదులు, అలుగు వర్షిణి ప్రత్యేకంగా అభినందించారు.