TG Group-3 | తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థుల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. సెలక్షన్ లిస్ట్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. గ్రూప్-3కి 1,370 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో జరిగిన గ్రూప్-3 పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. జూనియర్ అసిస్టెంట్, ఎల్డి స్టెనో, టైపిస్ట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ తదితర పోస్టులను భర్తీ చేసేందుకు నిర్వహించిన పరీక్షకు సుమారు 2.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.