Goup 2 Exams | హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): గ్రూప్-2 పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉద యం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లోనూ ప్రశ్నలు అత్యంత కఠినంగా వచ్చాయి. స్టేట్మెంట్ ఆధారమైనవి ఎక్కువగా ఉండటం, ప్రశ్నలు పెద్దవిగా ఉండటంతో అభ్యర్థులకు సమయం సరిపోలేదు. జనరల్ స్టడీస్ పేపర్ అత్యంత కఠినంగా ఇచ్చారు.
చాలాకాలంగా ప్రిపేరవుతున్న వారు సైతం 150కి 70-90కిపైగా స్కోర్చేయలేని విధంగా ప్రశ్నలు ఇచ్చారు. పేపర్-2లో చరిత్రలో ప్రశ్నలు అత్యంత కఠినంగా ఉన్నాయి. జనరల్ స్టడీస్‌లో తెలంగాణ పాలసీలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, పలు రాష్ర్టాల్లో అసెంబ్లీ స్థానాలు, ఆస్కార్, చలనచిత్ర అవార్డులపై ప్రశ్నలొచ్చాయి. గ్రూప్-2 పరీక్షలు సోమవారం సైతం జరగనున్నాయి. ఉదయం పేపర్-3, మధ్యాహ్నం పేపర్-4కు పరీక్షలు జరగనున్నాయి.
పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్‌కు 46.75 శాతం, పేపర్-2 పాలిటీ, హిస్టరీ సోషియోకల్చర్కు 46.30 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. ఈ పరీక్షకు 5,51,855 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పేపర్-1ను 2,57,981 మంది, పేపర్-2ను 2,55,490 మంది రాశారు. గతానికి భిన్నంగా గ్రూప్-2 పరీక్ష రాసేందుకు అభ్యర్థులు నిరాసక్తత కనబరిచారు.