TG Group-1 | తెలంగాణ గ్రూప్-1 పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్షల ప్రొవిజనల్ మార్కులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అభ్యర్థులు లాగిన్ వివరాలతో మార్కులు చూసుకోవచ్చని పేర్కొంది. ప్రొవిజనల్ మార్కులను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఈ నెల 24వరకు రీకౌంటింగ్‌కు అవకాశం కల్పిస్తున్నామని.. రూ.1000 చెల్లించి రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. ఇక రీకౌంటింగ్ అనంతరం జనరల్ ర్యాంక్స్ జాబితాను ప్రకటించనున్నట్లు పేర్కొంది. 563 పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్ చివరివారంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగ్గా.. 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు.