పాతాళానికి భూగర్భజలం
రాష్ట్రంలో ఈ ఏడాది లోటు వర్షపాతం, రిజర్వాయర్లు అడుగంటడంతో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏటా వేసవిలో సగటున 6.22 మీటర్ల లోతున ఉండే భూగర్భ నీటిమట్టం ఈసారి ఇప్పటికే 7.77 మీటర్ల లోతుకు పడిపోయింది. నిరుడు రాష్ట్రవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదైనప్పటికీ ఈ ఏడాది వర్షపాతం భారీగా తగ్గింది. దీంతో ప్రస్తుతం భూగర్భ జలమట్టం నిరుటి కంటే 2 మీటర్ల లోతుకు పడిపోయింది.
- రాష్ట్రంలో వేగంగా తగ్గుతున్న భూగర్భ జల మట్టాలు
- నిరుటి కంటే 2 మీటర్లు అడుగుకు
- కృష్ణా, గోదావరి బేసిన్లోనూ అంతంతే
- రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులే
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ ఏడాది లోటు వర్షపాతం, రిజర్వాయర్లు అడుగంటడంతో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏటా వేసవిలో సగటున 6.22 మీటర్ల లోతున ఉండే భూగర్భ నీటిమట్టం ఈసారి ఇప్పటికే 7.77 మీటర్ల లోతుకు పడిపోయింది. నిరుడు రాష్ట్రవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదైనప్పటికీ ఈ ఏడాది వర్షపాతం భారీగా తగ్గింది. దీంతో ప్రస్తుతం భూగర్భ జలమట్టం నిరుటి కంటే 2 మీటర్ల లోతుకు పడిపోయింది.
రాబోయే రోజుల్లో, ముఖ్యంగా ఈసారి వేసవిలో ఇది మరింత తగ్గే పరిస్థితి కనిపిస్తున్నది. ప్రస్తుతం 13 జిల్లాల్లో భూగర్భ జలాలు నిరుటి కంటే 10 మీటర్ల లోతుకు చేరుకున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని జిల్లాల్లోనూ గణనీయంగా పడిపోయాయి. 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి గోదావరి జలాలను పరిపూర్ణంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. ఆ ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, నిజాంసాగర్, సింగూరు, ఎగువ మానేరు, దిగువ మానేరు, కడెం, వరద కాలువ తదితర ప్రాజెక్టులను అనుసంధానించి అవసరం మేరకు ఎప్పటికప్పుడు జలాలను ఎత్తిపోసేవారు. తద్వారా ఆయా ప్రాజెక్టులకు కింద ఉన్న చెరువులను క్రమం తప్పకుండా నీటితో నింపేవారు. కానీ, మేడిగడ్డ బరాజ్ కుంగిందన్న సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చెరువులను, చెక్‌డ్యామ్‌లను నింపడం లేదు. ఫలితంగా గోదావరి బేసిన్లోనూ భూగర్భజలాలు త్వరగా అడుగంటుతున్నాయి.
కాంగ్రెస్ సర్కార్ పాపమే
వాస్తవంగా భూగర్భ జలమట్టాన్ని పెంచడంలో చెరువులు, కాలువలు, ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లు, పెరోలేషన్ రీచార్జి నిర్మాణాలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిలో కాలువలు, చెరువుల ద్వారానే 10 శాతానికిపైగా భూగర్భ జలమట్టం రీచార్జి అవుతుంటుంది. కానీ, రేవంత్‌రెడ్డి సర్కార్ చెరువులను నింపకపోవడం, కాలువల ద్వారా సాగునీటి సరఫరా లేకపోవడంతో ఆ మేరకు భూగర్భ జల రీచార్జి తగ్గిపోయింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి నీటి సరఫరా లేకపోవడంతో వ్యవసాయ అవసరాలకు పూర్తిగా భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్న రైతులు ఎక్కడికక్కడ బోర్ల ద్వారా నీళ్లను తోడేస్తున్నారు. ఇప్పుడు బోర్లు కూడా మొరాయిస్తుండటంతో కొందరు వాటి లోతును మరింత పెంచుతున్నారు. మరికొందరు కొత్త బోర్లను వేయిస్తున్నారు. దీంతో గతంలో కంటే వేగంగా భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

