హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): మంత్రి హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుంతరావును తక్షణమే బీఆర్ఎస్ పార్టీ నుంచి సప్పెండ్ చేయాలని తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ (టీజీఏ) రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
హరీశ్‌రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమ ద్రోహిగా పేరుతెచ్చుకున్న మైనంపల్లి నిఖార్సైన ఉద్యమకారుడు, సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అహర్నిశలు కృషిచేస్తున్న హరీశ్‌రావుపై చేసిన వ్యాఖ్యలకు మైనంపల్లి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.