హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): సర్కారు స్కూళ్లలోని విద్యార్థులకు అందజేసే యూనిఫాంలు 90శాతం సిద్ధమైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. బడులు పునఃప్రారంభమయ్యే బుధవారం విద్యార్థులకు జత యూనిఫాం చొప్పున అందజేస్తామని వెల్లడించింది. రాష్ట్రంలోని 15,30,603 మంది విద్యార్థులకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా యూనిఫాంలు అందజేస్తారని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. యూనిఫాంలు కుట్టించే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించామని, దీంట్లో భాగస్వామ్యమైన వారందరికి మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారని పేర్కొంది. యూనిఫాంల కుట్టుకూలీ చార్జీలను రూ.50 నుంచి రూ.75కు పెంచామని ప్రకటించింది.