హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరంపై ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
న్యాయనిపుణుల సూచనల మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైతే సీబీఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని, నేరుగా కలిసి వినతిపత్రం సమర్పించాలని మంత్రులకు సూచించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయనిపుణుడు అభిషేక్ సింఘ్వీతో చర్చించి ప్రభుత్వం అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి నిర్దేశించారు.