హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ, ఉపాధి, కులం) కార్యక్రమం బుధవా రం ప్రారంభమైంది. తొలిరోజు ఎన్యుమరేటర్లు సర్వే చేయాల్సిన ఇండ్ల గు ర్తింపును ప్రారంభించారు. మరో రెం డురోజుల పాటు జరిగే గుర్తింపు ప్రక్రియలో ఇండ్లకు స్టిక్కర్లు అంటిస్తారు. ఆ తర్వాత ఇంటింటికీ వెళ్లి 57ప్రశ్నలతో వివరాలు సేకరిస్తారు.
మిగతా జిల్లాలో 18నుంచి బహిరంగ విచారణ
హైదరాబాద్, నవంబర్6 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ నిర్ణయానికి సంబంధించి బహిరంగ విచారణను ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకు తిరిగి ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ నిర్ణయించింది. రిజర్వేషన్ల స్థిరీకరణకు డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చే యాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో బీసీ కమిషన్ బహిరంగ వి చారణను నిలిపివేసింది. తాజాగా ఆ యా అంశాలపై బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు బుధవారం ప్రత్యేకంగా చర్చించారు. ఈ క్రమం లో రిజర్వేష న్ల స్థిరీకరణ అంశాలపై కాకుండా వెనుకబడిన తరగతుల కులాల స్థితిగతులపై మిగిలిన ఉమ్మడి 5జిల్లాల్లో బ హిరంగ విచారణ కొనసాగించాలని నిర్ణయించారు. నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్లో 18 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు జయప్రకాశ్, సురేందర్, బాలలక్ష్మితో ప్రభుత్వం ఇటీవల నియమించిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు బుధవారం భేటీ అయ్యా రు. బీసీ కమిషన్ చేసిన అధ్యయన వి వరాలను తెలుసుకున్నారు.