హైదరాబాద్, నవంబర్ 20(నమస్తే తెలంగాణ) : నేత కార్మికుల రుణమాఫీ కోసం రూ.33కోట్లు విడుదల చేసినట్టు చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకురావడంతో పాటు పునరుద్ధరించినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల నేతన్నలకు నిరంతర ఉపాధి లభిస్తుందని, అందులో భాగంగా టెస్కోకు రూ.588కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని చెప్పారు.
రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, హనుమకొండ జిల్లాల్లోని 130 ఎంఏసీఎస్, 56 ఎస్ఎస్ఐ యూనిట్ల ద్వారా ఇందిరా మహిళా శక్తి పథకం కింద, స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరల ఉత్పత్తి జరిగిందని వివరించారు. అంతకుముందు ధర్నాచౌక్లో రుణమాఫీ కోసం చేనేత కార్మికులు ధర్నా చేశారు. ప్రభుత్వం దిగొచ్చి రుణమాఫీ కోసం రూ.33కోట్లు విడుదల చేసిందని నేత కార్మికులు తెలిపారు.