హైదరాబాద్/వరంగల్, మే 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ తాటికొండ రమేశ్‌పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వైస్ చాన్సలర్‌గా రమేశ్ తీసుకున్న నిర్ణయాలపై అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్(అకుట్)లోని కొందరు ప్రతినిధులు శుక్రవారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశానికి ఫిర్యాదు చేశారు.
కాకతీయ యూనివర్సిటీలో 12 ఎకరాలు కబ్జా అయిందని, మెస్‌బిల్లుల పేరుతో రూ.2.50 కోట్ల అక్రమాలు జరిగాయని, ఆరోపణలతో తొలగించిన వారిని ఫ్యాకల్టీగా మళ్లీ నియమించారని, బదిలీలో అక్రమాలు, నకిలీ ప్రాజెక్టుల పేరిట నిధుల ఖర్చు వంటి అంశాలను ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదులోని అంశాలపై విచారణ నిర్వహించాలని బుర్రా వెంకటేశం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌కు శనివారం ఆదేశాలు ఇచ్చారు. తాటికొండ రమేశ్ పదవీకాలం ఈ నెల 21న ముగుస్తున్నది. కాకతీయ యూనివర్సిటీ వీసీపై విజిలెన్స్ విచారణ జరగడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో పలు యూనివర్సిటీలకు కొత్తగా వీసీలను నియమించేందుకు ప్రభుత్వం సెర్చ్ కమిటీలు నియమించింది. కానీ కాకతీయ యూనివర్సిటీకి సెర్చ్ కమిటీని నియమించలేదు. కేయూకు కొత్త వీసీ నియామకం వాయిదా వేసేందుకే ఇలా చేసిందని సమాచారం.
కేయూ వీసీపై విజిలెన్స్ విచారణకు ఆదేశం
హైదరాబాద్/వరంగల్, మే 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ తాటికొండ రమేశ్‌పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వైస్ చాన్సలర్‌గా రమేశ్ తీసుకున్న నిర్ణయాలపై అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్(అకుట్)లోని కొందరు ప్రతినిధులు శుక్రవారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశానికి ఫిర్యాదు చేశారు. కాకతీయ యూనివర్సిటీలో 12 ఎకరాలు కబ్జా అయిందని, మెస్‌బిల్లుల పేరుతో రూ.2.50 కోట్ల అక్రమాలు జరిగాయని, ఆరోపణలతో తొలగించిన వారిని ఫ్యాకల్టీగా మళ్లీ నియమించారని, బదిలీలో అక్రమాలు, నకిలీ ప్రాజెక్టుల పేరిట నిధుల ఖర్చు వంటి అంశాలను ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదులోని అంశాలపై విచారణ నిర్వహించాలని బుర్రా వెంకటేశం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌కు శనివారం ఆదేశాలు ఇచ్చారు. తాటికొండ రమేశ్ పదవీకాలం ఈ నెల 21న ముగుస్తున్నది. కాకతీయ యూనివర్సిటీ వీసీపై విజిలెన్స్ విచారణ జరగడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో పలు యూనివర్సిటీలకు కొత్తగా వీసీలను నియమించేందుకు ప్రభుత్వం సెర్చ్ కమిటీలు నియమించింది. కానీ కాకతీయ యూనివర్సిటీకి సెర్చ్ కమిటీని నియమించలేదు. కేయూకు కొత్త వీసీ నియామకం వాయిదా వేసేందుకే ఇలా చేసిందని సమాచారం.
హనుమకొండ చౌరస్తా, మే 18 : కాకతీయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్‌గా తనపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ ఎంక్వైరీని ఆహ్వానిస్తున్నానని వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన తాను కేయూ వీసీగా 3 సంవత్సరాల పదవీ కాలంలో ఎకడా నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. యూనివర్సిటీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశానని, ఆ ఫలితమే న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ సాధించినట్టు, జాతీయస్థాయిలో యూనివర్సిటీ హోదా, ప్రతిష్ఠను మరింతగా పెంచినట్టు పేర్కొన్నారు.
ప్రతిష్టాత్మక ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌ను నిర్వహించామని, మూడేండ్లలో యూనివర్సిటీ సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన అన్ని రకాల సదుపాయాలు, బెనిఫిట్స్, బకాయిలు అందించినట్టు పేర్కొన్నారు. యూనివర్సిటీ చరిత్రలోనే మొదటిసారిగా ప్రభుత్వ సహకారంతో 507 మంది దినసరి, తాతాలిక ఉద్యోగులకు జీతాలు 3 నుంచి 4 రెట్లు పెంచామని చెప్పారు. గతంలో పీహెచ్డీ అడ్మిషన్లపై కొందరు తీవ్ర ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం విచారణ కమిటీని నియమించిందని, ఆ కమిటీ అడ్మిషన్లు పూర్తి పారదర్శకంగా జరిగిందని తెలిపిందని చెప్పారు. తన హయాంలో ఒక పర్మినెంట్ రిక్రూట్మెంట్ కూడా జరగలేదని, యూనివర్సిటీ భూమి ఒక గుంట కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడినట్టు పేర్కొన్నారు. యూనివర్సిటీ అభివృద్ధిని ఓర్వలేక దొడ్డిదారిలో ప్రమోషన్ల పొందాలనుకునే వ్యక్తులు, అక్రమ అడ్మిషన్లు కావాలని గగ్గోలు పెట్టే వ్యక్తులు చేసిన ఫిర్యాదుపై ప్రభుత్వం విజిలెన్స్ కమిటీ వేయడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నట్లు కేయూ వీసీ రమేశ్ పేర్కొన్నారు.