హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జలవనరులు, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీడబ్ల్యూఆర్ఐడీసీఎల్) లిమిటెడ్‌కు ప్రభుత్వం రూ.2,962.47 కోట్ల నిధులు మంజూరు చేసింది. శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వికారాబాద్ జిల్లాలోని కోటిపల్లివాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు రూ.89.30 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.