హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై విచారణకు ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాలపరిమితిని ప్రభుత్వం మరోసారి రెండు నెలలు పొడగించింది. ఏప్రిల్ 30లోగా నివేదికను సమర్పించాలని సూచిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రాజెక్టుపై విచారణ చేపట్టి 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని కోరుతూ ప్రభుత్వం జస్టిస్ ఘోష్ కమిషన్ను గతేడాది ఫిబ్రవరిలో నియమించింది. ఆ గడువు జూన్లో ముగియగా.. అక్టోబర్ 31వరకు, ఆ తర్వాత డిసెంబర్ 31, ఫిబ్రవరి 28 వరకు పొడగించింది. ఇప్పటికీ విచారణ పూర్తికాకపోవడంతో మరోసారి గడువును పొడిగించింది.