పెండింగ్లో ఉన్న చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువును మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పాత నిబంధనల ప్రకారం మార్చి 1 నుంచి 31 వ తేదీ వరకూ ఈ రాయితీ వర్తిస్తుంది. అయితే.. ప్రజల్లో వస్తున్న విశేష స్పందనను చూసి, ప్రజలకు మరింత సౌలభ్యాన్ని కల్పించడం కోసం ఈ రాయితీ గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రకటించారు.
ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు చెల్లింపు జరిగిందని హోమంత్రి తెలిపారు. వీటి విలువ 840 కోట్ల రూపాయలని ఆయన వెల్లడించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇప్పటివరకు 250 కోట్ల రూపాయలు చెల్లించి పెండింగ్ చలానా క్లియర్ చేయడం జరిగిందనీ, మరియు రాష్ట్ర వ్యాప్తంగా 52% మోటారు వాహన యజమానులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇంతవరకూ చలాన్లు చెల్లించలేక పోయినవారు ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ-చలాన్ వెబ్సైట్ లో ఆన్లైన్ పేమెంట్ ద్వారా తమ చలాన్ క్లియర్ చేసుకోవాల్సిందిగా రాష్ట్ర హోం మంత్రి పిలుపునిచ్చారు.
ఈ క్రింద విధముగా వివిధ రకాల వాహన యజమానులకు ఈ క్రింది విధముగా రాయితిని నిర్ణయించడం అయినది
• 2W/3W- కట్టండి 25%, మిగతా బ్యాలన్స్ 75% మాఫీ
• RTC డ్రైవర్స్ కట్టండి 30%, మిగతా బ్యాలన్స్ 70% మాఫీ,
• LMV/ HMV – కట్టండి 50%, మిగతా బ్యాలవ్స్ 50% మాఫ్,
• తోపుడు బండ్ల వ్యాపారులు కట్టండి 2o%, మిగతా బ్యాలన్స్ 80% మాఫీ,
• నో మాస్క్ కేసులు- కట్టండి Rs 100, మిగతా బ్యాలన్స్ Rs 900 మాఫీ,
బకాయిలు చెల్లింపు కోరిన మోటారు వాహన యజమనులు అన్ని విధముల ఆన్లైన్ సేవా చెల్లింపుల ద్వారా గానీ, ఈ-సేవ, మీసేవ ద్వారా గాని చెల్లింపవచ్చు.