హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్. వరుసగా 13 రోజులు సెలవులు రాబోతున్నాయి. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు బడులకు దసరా సెలవులు ప్రకటించారు. గాంధీ జయంతి మొదలు.. బతుకమ్మ, దసరా పండుగ వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. కొన్ని ప్రైవేటు స్కూళ్లకు 14 రోజులు సెలవులు ఇవ్వనున్నారు. అక్టోబర్ 15న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను మే 25న విడుదల చేసింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు, జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. క్యాలెండర్ ప్రకారం.. 2025 ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. 2025 ఫిబ్రవరి 28లోపు టెన్త్ ప్రీఫైనల్, మార్చిలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు.