హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా 10 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. ఆదివారం తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్ శివధర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీపీ, సీసీఎస్ అండ్ డీడీ హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఎల్ ఆదినారాయణను కొత్తగూడెం ఎస్డీపీవోగా నియమించారు. కొత్తగూడెం ఎస్డీపీవోగా పనిచేస్తున్న ఎస్కే అబ్దుల్ రహ్మన్‌ను తెలంగాణ డీజీపీ కార్యాలయానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఏసీపీ, సీటీసీ, హైదరాబాద్‌లో పనిచేస్తున్న డీవీ ప్రదీప్‌కుమార్‌రెడ్డిని ఆదిభట్ల(హైదరాబాద్) ఏసీపీగా బదిలీ చేశారు. డీఎస్పీ, సీఐడీ (పీఎస్క్యూఎంయూ)లో విధులు నిర్వహిస్తున్న ఎం ఆదిమూర్తిని మియాపూర్ ట్రాఫిక్ ఏసీపీగా బదిలీ చేశారు. మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణిని జవహర్‌నగర్ ఏసీపీ(మల్కాజిగిరి)గా ట్రాన్స్ఫర్ చేశారు.
ఏసీపీ, ఎస్బీ హైదరాబాద్‌లో పనిచేస్తున్న బీ మోహన్‌కుమార్‌ను మేడిపల్లి(మల్కాజ్గిరి) ఏసీపీగా నియమించారు. సిద్దిపేట టాస్క్‌ఫోర్స్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న బీ రవీందర్‌ను ఖాళీగా ఉన్న భువనగిరి ఎస్డీపీవోగా ట్రాన్స్ఫర్ చేశారు. డీఎస్పీ, తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరోలో పనిచేస్తున్న సీహెచ్ శ్రీధర్‌ను మహంకాళి డివిజన్ ఏసీపీగా నియమించారు. టీజీపీఏలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఎస్ సారంగపాణిని ఇల్లందు ఎస్డీపీగా నియమించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎన్ చంద్రబాబును డీజీపీ ఆఫీస్, హైదరాబాద్‌లో రిపోర్ట్ చేయాలని సూచించారు.