‘డెల్టా ప్లస్’ను ఎదుర్కొనేందుకు సిద్ధం: డీహెచ్ శ్రీనివాసరావు
డెల్టా ప్లస్| డెల్టా ప్లస్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. డెల్టా వేరియంట్ కన్నా డెల్టా ప్లస్ ప్రమాదకరమనే ఆధారాలు లేవని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదవలేదని వెల్లడించారు.

హదరాబాద్: డెల్టా ప్లస్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. డెల్టా వేరియంట్ కన్నా డెల్టా ప్లస్ ప్రమాదకరమనే ఆధారాలు లేవని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదవలేదని వెల్లడించారు. డెల్టా ప్లస్ వేరియంట్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ కోర్టుకు నివేదిక సమర్పించింది. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. నెల రోజుల్లో ప్రభుత్వ దవాఖానల్లో పడకలన్నింటికీ ఆక్సిజన్ సౌకర్యం కల్పిస్తామన్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1.14 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేశామని తెలిపారు. ఇందులో 16.39 లక్షల మందికి రెండు డోసులు ఇచ్చామని, 81.42 లక్షల మందికి ఒక డోసు వ్యాక్సినేషన్ పూర్తయిందని వివరించారు. మరో 1.75 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. విద్యా సంస్థల్లో 1.40 లక్షల మంది సిబ్బందికి వ్యాక్సిన్లు ఇచ్చామన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం 11 కేంద్రాల్లో టీకాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. సరాసరి రోజుకు 1.12 లక్షల కరోనా పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. కరోనా పాజిటివిటీ రేటు 0.78 శాతానికి తగ్గింది వెల్లడించారు. ప్రైవేటు దవాఖానల్లో చికిత్సలు, గరిష్ఠ ధరలపై జీవో ఇచ్చామన్నారు. జీవో ఉల్లంఘిస్తే ప్రైవేటు వైద్య కేంద్రాలపై చర్యలు తీసుకుంటాని వివరించారు.
ఇవి కూడా చదవండి..
బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్ ఇక లేరు
దిలీప్ కుమార్ ప్రతి చిత్రం మేలిమి ముత్యం .. ఆయన నటన ఎవరెస్ట్ శిఖరం
సాయంత్రం 5 గంటలకు దిలీప్‌కుమార్ అంత్యక్రియలు
దిలీప్ కుమార్ కెరీర్లో ఎవర్గ్రీన్ పాట ఇదే.. వీడియో
అందుకే అతన్ని కెప్టెన్ కూల్ అనేది.. బర్త్‌డే బాయ్ ధోనీకి అరుదైన వీడియోతో ఐసీసీ సెల్యూట్
హెచ్ఐవీ వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్ షురూ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

