దిలీప్ కుమార్ ప్రతి చిత్రం మేలిమి ముత్యం .. ఆయన నటన ఎవరెస్ట్ శిఖరం

దిలీప్ కుమార్ .. .. ఈ పేరు వినగానే మనకు ఎంతో ఎత్తుగా ఉన్న శిఖరం గుర్తుకొస్తుంది. నిజమే. నటనలో ఆయన ఓ ఎవరెస్ట్ శిఖరం. ఆరు దశాబ్దాలుగా నటననే జీవితంగా పండించుకున్న బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్. 60 ఏళ్ల సుదీర్ఘ నటయాత్రలో దిలీప్ నటించింది చాలా తక్కువ చిత్రాలే. కానీ ఒక్కొక్కటీ ఓ మేలిమి ముత్యం. హిందీ చిత్ర రంగంలో ఆనాటి నటత్రయంలో ఒకరుగా భాసించిన దిలీప్ కుమార్ ఈ రోజు అనారోగ్యంతో కన్నుమూసారు.
మన దేశం గర్వించదగ్గ మహానటుడు దిలీప్ కుమార్. హిందీ సినిమాకు ఆయన ఓ లెజెండ్. నటన ఆయన వృత్తి కాదు , ప్రవృత్తి. ఆయన శ్వాస. ఆయన ఆశ. నటుడిగా సుదీర్ఘ జీవితం గడిపిన దిలీప్ కుమార్ దాదాపు మూడు నాలుగు తరాల నటీనటులు, నిర్మాత దర్శకులతో కలిసి పనిచేశారు. బాలీవుడ్ లో అంతకాలం పనిచేసిన నటుడు మరొకరు లేరు. సత్యజిత్ రే అంత విశిష్ట దర్శకుడు దిలీప్ కుమార్ గురించి చెబుతూ .. నటనకు పరాకాష్ట దిలీప్ .. .. అని ప్రశంసించారు.
దిలీప్ కుమార్ ఎక్కువ సినిమాలు చేయాలని ఎన్నడూ పరుగెత్తలేదు. తన 60 ఏళ్ల సినీజీవితంలో 60 సినిమాలు మాత్రమే చేశారంటే ఈ తరం వాళ్లు నమ్మకపోవచ్చు. కానీ షూటింగ్ లో దిలీప్ ప్రతి షాట్ కూడా తనకు నచ్చిన విధంగా వచ్చేదాకా ఓకే చేసేవారు కాదు. దర్శకుడికి నచ్చినా దిలీప్ కు నచ్చని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దిలీప్ కుమార్ ఒక సినిమా మొదలు పెడితే అది పూర్తి కావడానికి రెండేళ్లు పట్టేది. పర్ఫెక్షన్ వచ్చేవరకూ దిలీప్ వదిలేవారు కారు.
దిలీప్ కుమార్ నటించిన సినిమాలన్నీ పటిష్టమైన కథాబలంతో తీసినవే. వాటిలో బరువైన సన్నివేశాలు ఉండేవి. మానసిక సంఘర్షణకు లోనయ్యే పాత్రలు చేయడంలో దిలీప్ దిట్ట. ఆయనను ట్రాజెడీ కింగ్ అనేవారు. విషాదాంత కథానాయకుడిగా దిలీప్ కుమార్ రాణించారు. 1922 డిసెంబర్ 11న పుట్టిన దిలీప్ కుమార్ 1944లో బాంబే టాకీస్ తీసిన జ్వర్ భటా సినిమాతో సినిమాల్లోకి వచ్చారు. దిలీప్ నటజీవితంలో కలికి తురాయి అనదగ్గ చిత్రం మొఘల్ – ఏ- ఆజం.
దిలీప్ కుమార్ చిత్రాలన్నీ ఆయనకు మైలు రాళ్లుగా నిలిచాయి. ఆ రోజుల్లో దిలీప్ సినిమా అంటే ఆడియన్స్ కు ఎంతో ఆసక్తి ఉండేది. దిలీప్ కుమార్ ప్రతి చిత్రం శతదినోత్సవం చేసుకుందంటే . .. ఆయన ఎంతటి అద్వితీయ నటుడో తెలుస్తుంది. నటీమణులు కూడా ఆయనతో నటించేందుకు ఇష్టపడేవారు. మధుమతి, కోహినూర్, యాహుదీ, దేవదాస్, అందాజ్, షబ్నమ్, షహీద్, గంగా జమున, నయాదౌర్, లీడర్, పైఘామ్ వంటి సినిమాలు దిలీప్ కుమార్ నటజీవితానికి మణిమకుటాలు.
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
- Tags
- bollywood
- dilip kumar
- legend
RELATED ARTICLES
తాజా వార్తలు
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
Jupally Krishna Rao | మంత్రి జూపల్లిని విమర్శించారని.. యువకుడిని చితకబాదిన ఎస్సై
Nereducherla | బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడి!
Journalist Shankar | ప్రశ్నించినందుకు జర్నలిస్టు శంకర్ అరెస్ట్.. మెడికవర్ యాజమాన్యం ఫిర్యాదుపై కేసు
Asian Para Games | భారత్‌కు ఒక్క రోజే 26 మెడల్స్.. 2 స్వర్ణాలతో మెరిసిన ఆర్చర్ శీతల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

