Patnam Mahender Reddy | హైదరాబాద్ : ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పట్నం మహేందర్‌రెడ్డికి శాఖలు కేటాయించారు. సమాచార పౌర సంబంధాల శాఖ, గనులు భూగర్భవనరుల శాఖను ఆయన కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం కేసీఆర్ ఈ నెల 24న క్యాబినెట్ విస్తరణలో పట్నం మహేందర్ రెడ్డి రెండోసారి మంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్ర తొలి క్యాబినెట్లో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఫలితాల అనంతరం మహేందర్‌రెడ్డికి బీఆర్ఎస్ అధిష్ఠానం ఎమ్మెల్సీగా రెండుసార్లు అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్సీగా ఉండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం నరేందర్‌రెడ్డి స్థానంలో 2019 జూన్‌లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి మహేందర్‌రెడ్డి గెలుపొందారు.