IT Exports | తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఐటీ ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయి. దేశంలోనే ఐటీరంగం పెట్టుబడులకు తెలంగాణ కేంద్రంగా మారింది. జిల్లా కేంద్రాలు, ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి. ఐటీరంగ ప్రాధాన్యాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఐదేండ్లకోసారి ఐటీ పాలసీలను రూపొందించి అమలు చేస్తున్నది. తెలంగాణ ఏర్పాటు సమయంలో 3 స్టార్టప్ ఇంక్యుబేటర్లు, 200 స్టార్టప్‌లు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 77 ఇంక్యుబేటర్లు, 7 వేలకు పైగా స్టార్టప్‌లు ఉన్నాయి. టీ హబ్, టీహబ్ 2.0, టీవర్క్స్, వీహబ్, టీఎస్ఐసీ, రిచ్ వంటి ఇంక్యుబేటర్లను రాష్ట్రప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తున్నది.
విశేషం: పారిశ్రామిక పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా నిలిచింది. తొమ్మిదిన్నరేండ్ల వ్యవధిలో రాష్ర్టానికి 23 వేలకు పైగా పరిశ్రమలు క్యూ కట్టాయి. అంతర్జాతీయ ఐటీ, ఎలక్ట్రానిక్, ఫార్మా కంపెనీలు దేశంలో తమ శాఖలను ప్రారంభించేందుకు పరిశీలిస్తున్న తొలి మూడు ప్రాథమ్య రాష్ర్టాల్లో తెలంగాణ పేరు కచ్చితంగా ఉంటున్నది.
2014: రూ.66,276 కోట్లు
2023: రూ.2,41,275 కోట్లు
పెరుగుదల 264%