హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రైతులు పండించిన అన్ని రకాల పంటల్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తున్నది. అది కూడా మద్దతు ధరకు కొంటున్నది. పంట అమ్ముకునేందుకు రైతులకు ఇబ్బంది లేకుండా గ్రామాల్లో, మార్కెట్లలో ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ధాన్యం, శనగలు, జొన్నలు, మక్కలు సహా అన్ని పంటలను కొంటున్నది.
మధ్యప్రదేశ్లో..
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో వెల్లుల్లి రైతుల కష్టాలివీ. పండించిన పంటను మార్కెట్లో అమ్మితే పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో గత్యంతరం లేక నదుల్లో ఇలా పారబోస్తున్నారు.
తెలంగాణలో..
తెలంగాణలో రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరీ రాష్ట్ర ప్రభుత్వం కొంటున్నది.