Foreign Education : విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనే కల ఎంతో మంది విద్యార్థులకు కలగానే మిగిలిపోతుంది. ఆర్థిక స్థోమత లేని కారణంగా చాలామందికి విదేశాల్లో చదువుకోవాలనే కోరిక ఉన్నా చదువుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో ప్రతిభ కలిగిన పేద దళిత విద్యార్థులకు విదేశాల్లో విద్యాభ్యాసం చేసే అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకం ద్వారా నిధులను సమకూరుస్తోంది.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎస్సీ విద్యార్థులు ఇవాళ్టి నుంచి అక్టోబర్ నెల 13 వ తారీఖు వరకు ఈ విదేశీ విద్యానిధి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ఈ-పాస్ వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.