హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ప్రభుత్వం ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ప్రకటించింది. 13 రోజులపాటు అన్ని స్కూళ్లకు సెలవులు ఇవ్వనున్నారు.
దసరా పండుగ అనంతరం అక్టోబర్ 4న(శనివారం) పాఠశాలలను తిరిగి తెరువనున్నారు. ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు మాత్రం 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ప్రకటించారు.