హైదరాబాద్: దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Sing) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి స్పృహ కోల్పోవడంతో కుటుంబసభ్యులు దవాఖానకు తరలించారు. దాదాపు గంటన్నర పాటు ఆయనకు చికిత్స అందించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో రాత్రి 9.51 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ (Telangana) ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. వారం జోరులపాటు సంతాప దినాలు పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాతికుమారి గురువారం రాత్రి జారీచేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.