హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : బీటెక్‌లో డిటెన్షన్ విధానంలో తేడాలపై ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తంచేశారు. జేఎన్టీయూలో 25శాతం క్రెడిట్స్, ఓయూ లో 50శాతం క్రెడిట్స్ సాధించకపోతే డిటెన్షన్ చేస్తున్నారని ఈ వ్యత్యాసమేంటనీ ప్రశ్నించారు. ఓయూలో డిటెన్షన్ విధానం కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారని, ఫెయిలైన విద్యార్థులకు దీని నుంచి మినహాయింపునివ్వాలని కోరారు. కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థులతో సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని కోరా రు. దీనిపై మంత్రి దామోదర రాజనర్సింహా స్పందిస్తూ ఓయూలో ఈ యే డు డిటెన్షన్ విధానం నుంచి మినహాయింపునిస్తామని, త్వరలోనే సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు.