SSC Exams | పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు ఎత్తివేయాలన్న నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పాత పద్ధతిలోనే టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. 20 శాతం ఇంటర్నల్ మార్కుల విధానం యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
పదో తరగతిలో ఇంటర్నల్ మార్కులను ఎత్తివేసి 100 మార్కులకు ప్రశ్నపత్రం రూపొందించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గత ఏడాది నవంబర్‌లో జీవో జారీ చేసింది.అయితే ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ఎన్సీఈఆర్టీ వర్క్‌షాపులో ఈ నిర్ణయంపై ప్రశ్నలు తలెత్తడంతో పునరాలోచనలో పడిన పాఠశాల విద్యాశాఖ అధికారులు.. పాత విధానాన్నే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.