హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో ప్లస్-2 విద్యను ప్రవేశపెట్టడాన్ని తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ అసోసియేషన్ (టీజీహెచ్ఎంఏ) స్వాగతించింది. ఈ విధానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, ముఖ్య సలహాదారు డాక్టర్ పర్వతి సత్యనారాయణ ప్రకటించారు.
ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వం అవకాశం కల్పిస్తే సర్కార్ బడుల్లో ఇంటర్ విద్యను సమర్థవంతంగా అమలుచేస్తామని పేర్కొన్నారు. ప్లస్ -2 విద్యను ప్రవేశపెట్టే ముందు ఉపాధ్యాయ సంఘాలు, ప్రధానోపాధ్యాయల అభిప్రాయాలను పరిగణిలోకి తీసుకోవాలని కోరారు.