తెలంగాణ సొమ్మును పక్క రాష్ర్టాల్లో పార్టీ ప్రచారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నది. బీహార్లో త్వరలో ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీని గెలిపించుకునేందుకు తెలంగాణ ప్రజల సొమ్మును అప్పనంగా ఖర్చుపెడుతున్నది.
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎంతో చేస్తున్నదని గొప్పలు చెప్పుకుంటున్నది. తెలంగాణలో పథకాలు, జీతాలకు రూపాయి పుట్టడం లేదని చెబుతున్న సీఎం రేవంత్రెడ్డి, బీహార్లో ఇలా పత్రికలకు భారీ ప్రకటనలు చేస్తూ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.