హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): కర్ణాటక అక్రమ సొమ్ముతో తెలంగాణలో గెలిచేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ ఒక ప్రకటనలో విమర్శించారు. బెంగళూరులోని ఓ కాంగ్రెస్ నేత ఇంటిలో పట్టుబడ్డ రూ.42 కోట్లు ఎకడివని, హైదరాబాద్ తరలించేందుకు సిద్ధంగా ఉంచిన అక్రమ సొమ్ము కాదా అని ప్రశ్నించారు. సొమ్ముతో ఇక్కడ గెలువాలని హస్తం నేతలు కలలు కంటున్నారని, ఎన్నికోట్లు ఖర్చు పెట్టినా తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు అసాధ్యమని తేల్చిచెప్పారు.