Minister Niranjan Reddy | వ్యవసాయరంగమే తెలంగాణ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో వ్యవసాయరంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపినట్లు తెలిపారు. కేరళ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరువనంతపురంలో నిర్వహిస్తున్న వైగా- 2023 అంతర్జాతీయ సదస్సులో నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయానికి, వ్యవసాయ అనుకూల విధానాలకు తెలంగాణలో పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా సాగు విస్తీర్ణం భారీగా పెరగడంతో పాటు పంట ఉత్పత్తి కూడా పెరిగిందన్నారు.
విలువ ఆధారిత ఉత్పత్తులను పెంచడానికి వ్యవసాయ ఆధారిత స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో ఆయా వాతావరణ పరిస్థితులను బట్టి సాగయ్యే పంటల ఆధారంగా దేశాన్ని క్రాప్ కాలనీలుగా విభజించాల్సిన ఆవశ్యకత ఉన్నదని మంత్రి అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. చిన్న చిన్న దేశాల నుంచి ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం దురదృష్టకరమన్నారు. సమావేశంలో ఫికీ కేరళ అధ్యక్షుడు సావియో మాథ్యూ, పరిశ్రమల శాఖ అదనపు సంచాలకులు సుధీర్, కేరళ పరిశ్రమల బ్యూరో జీఎం వన్ రాయ్, తెలంగాణ మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మిబాయి, అదనపు సంచాలకులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరువనంతపురంలో జరుగుతున్న వైగా 2023 అంతర్జాతీయ సదస్సులో ‘వ్యవసాయ ఉత్పత్తులకు విలువలు పెంపొందించడం’ (developing value chain in agriculture ) అనే అంశంపై జరిగిన చర్చలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి @SingireddyBRS గారు pic.twitter.com/22X1pPt3I0
— Singireddy Niranjan Reddy (@SingireddyBRS) February 28, 2023