హైదరాబాద్, జూన్25 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా పలు ప్రాజెక్టులను చేపడుతూనే పాత ప్రాజెక్టుల సామర్థ్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా విస్తరిస్తున్నా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదంటూ తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. ఏపీకి అడ్డుకట్ట వేయాలంటూ ఇప్పటి వరకు 142 లేఖలు రాసిన రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ తాజాగా మరో లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా చేపడుతున్న ప్రాజెక్టులను నిలిపివేయాలని కోరుతూ 40, ప్రాజెక్టుల అక్రమ విస్తరణను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ 32, కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన అంశాలపై 70 లేఖలు రాసినట్టు ఆయన గుర్తు చేశారు. ఇన్ని లేఖలు రాసినా ఒక్క దానిపైనా చర్యలు తీసుకోలేదని చెప్పారు.