హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ‘బీజేపోళ్లు మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని ముద్దాడుతరు’ అని సీఎం కేసీఆర్ ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యను బీజేపీ నేతలు పదేపదే నిజం చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ చేసిన పాపాన్ని కడిగేందుకు.. వరి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రెస్‌మీట్ పెట్టి ‘ఇది బీజేపీ విజయం’ అని ప్రకటించేసుకున్నారు. బీజేపీకి చేతగాక, రైతులను ఆదుకోలేక కేంద్రం చేతులెత్తేస్తేనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని రైతులు అంటున్నారు. బండి సంజయ్‌కి వారు కొన్ని ప్రశ్నలకు సంధిస్తున్నారు. సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.