హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 25 బార్లకు 1,346 దరఖా స్తులు వచ్చాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు ఏకంగా రూ.13.46 కోట్ల రాబడి వచ్చింది. అత్యధికంగా వరంగల్ అర్బన్ జిల్లాలోని 4 బార్లకు 491 దరఖాస్తులు వ చ్చాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఓ బార్‌కు ఒక్క దరఖాస్తు మాత్రమే వ చ్చింది. దీంతో ఆ బార్‌కు మే 5 వరకు ద రఖాస్తులు స్వీకరించి, మే 6న డ్రా ని ర్వహించనున్నట్టు ఎక్సైజ్ కమిషనర్ హ రికిరణ్ వెల్లడించారు.
మిగిలిన 24 బార్లకు 29న డ్రా తీసి కేటాయింపులు జరప నున్నట్టు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 3 బార్లకు 61 దరఖాస్తులు రాగా.. మంచి ర్యాలలో ఒక బార్‌కు 15, జగిత్యాల జిల్లా కోరుట్లలో ఒక బార్‌కు 24, వరంగల్ అర్బ న్లో 4బార్లకు 491, ఖమ్మంలో 2 బార్లకు 145, నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఒక బార్‌కు 226, మహబూబ్‌నగర్‌లో ఒక బార్‌కు 56, మక్తల్‌లో ఒక బార్‌కు 15, అలంపూర్‌లో ఒక బార్‌కు 4, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో 2 బార్లకు 18, మెదక్ లో ఒక బార్‌కు 53, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఒక బార్‌కు 8, వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఒక బార్‌కు 9 దరఖాస్తులు, సరూర్‌నగర్‌లోని మీర్‌పేట బార్‌కు 200 దరఖాస్తులు వచ్చాయి.