హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): పోలీసులు తన ఇంట్లోకి అడుగుపెట్టిన మరుక్షణం నుంచి అర్ధరాత్రి మళ్లీ ఇంటివద్ద వాళ్లే వదిలిపెట్టే వరకూ అనుక్షణం అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్ఎస్ లీగల్ సెల్ సోమాభరత్, గండ్ర మోహన్‌రావు, రాజేశ్వర్‌రావు, కల్యాణ్‌రావు, లలితారెడ్డి, జకుల లక్ష్మణ్, వేణుగోపాల్‌రావు, కార్తీక్, నిరంజన్‌రెడ్డితోపాటు న్యాయవాదులు తనకు అండగా నిలిచారని పేర్కొన్నారు. అక్రమ కేసు పెట్టి తనను జైలుకు పంపాలనే ప్రభుత్వ పన్నాగం పారలేదని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.