హైదరాబాద్, ఫిబ్రవరి 26: ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ఈహెచ్ఎస్ ట్రస్ట్ ఏర్పాటుకు మూల వేతనాల నుంచి 1శాతం ఇచ్చేందుకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) సంసిద్ధత వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని ఆ సంఘం కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ.. టీజీవోలో భాగస్వామిగా చేరిన మత్స్యశాఖ గెజిటెడ్ అధికారుల సంఘానికి అభినందనలు తెలిపారు. హెల్త్కార్డులపై ఉన్నత విద్యాశాఖ ఫోరం, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫోరం, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫోరం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. సమావేశంలో టీజీవో ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, హైదరాబాద్ నగరశాఖ అధ్యక్షుడు జీ వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణయాదవ్, కమర్షియల్ ట్యాక్స్ అధికారుల సంఘం అధ్యక్షుడు బీ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.