Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆర్టిజన్లు తమ సమ్మె విరమించారు. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయ్స్ యూనియన్ సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించింది. ఆర్టిజన్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావుతో చర్చలు జరిపినట్లు సంఘం ప్రధాన కార్యదర్శి సాయిలు తెలిపారు.
చర్చలు ఫలించడంతో బేషరతుగా సమ్మె విరమిస్తున్నామని, సమ్మెలో ఉన్న ఆర్టిజన్లు తక్షణమే విధుల్లోకి హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తొలగించిన 200 మంది ఆర్టిజెన్లను 10 రోజుల్లో విధుల్లోకి తీసుకుంటామని సీఎండీ ప్రభాకర్ రావు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.