హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తేతెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 19,587 మంది ఆర్జిజన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్సన్ జేఏసీ చైర్మన్ ఈశ్వర్రావు, కన్వీనర్ ఎంఏ వజీర్ ట్రాన్స్‌కో, డిస్కంల యాజమాన్యాలను డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో జేఏసీ ఆధ్వర్యంలో గురువారం 2వేల మంది కార్మికులు హైదరాబాద్ మింట్ కాంపౌడ్ వద్ద ఆందోళనకు దిగారు. ఎన్పీడీసీఎల్ ఆఫీసు ఎదుట 2గంటలపాటు బైఠాయించారు. ప్రభుత్వ, యాజమాన్య వ్యతిరేక నినాదాలు హోరెత్తాయి. వెంటనే న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్పీడీసీఎల్ చైర్మన్ ముషారఫ్ అలీకి వినతిపత్రం సమర్పించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 26 ( నమస్తే తెలంగాణ): నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ (ఎన్ఎఫ్ఐఆర్టీడబ్ల్యూ) జాతీయ ఉపాధ్యక్షుడిగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఆర్టీసీ జాక్ చైర్మన్ ఈదురు వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెంగళూరులో రెండ్రోజులు జరిగిన ఎన్ఎఫ్ఐఆర్టీడబ్ల్యూ జాతీయ మహాసభలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఆర్టీసీ ఈయూ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పాటి అప్పారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.