హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): నిరుపేద పిల్లలను విద్యకు దూరం చేసేలా ఉన్న జాతీయ విద్యావిధానం-2020ని రాష్ట్రప్రభుత్వం తిరస్కరించాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది. గురువారం యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే జంగయ్య, చావ రవి ఆధ్వర్యం లో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని కలిశారు.
విద్యారంగ సమస్యలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను నియంత్రించాలని విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించి పటిష్టం చేయాలని కోరారు. పలు డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈఈవో, డీవైఈవో, ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని కోరారు.