జూలై 14 నుంచి 20 వరకు ఎంసెట్
ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్‌ను జూలై 14 నుంచి 20 వరకు నిర్వహిస్తామని మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ప్రకటించారు.
- ఈసారీ ఇంటర్ వెయిటేజీ లేనట్టే!
- 13న ఈసెట్:మంత్రి సబిత వెల్లడి
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్‌ను జూలై 14 నుంచి 20 వరకు నిర్వహిస్తామని మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ప్రకటించారు. మంగళవారం బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నతాధికారులతో పరీక్షల నిర్వహణపై ఆమె సమీక్షించా రు. త్వరలో దరఖాస్తులు, ఫీజులతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్‌ను సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని చె ప్పారు. జూలై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్, జూలై 18 నుంచి 20 వరకు ఇంజినీరింగ్ విద్యార్థుల కు పరీక్షలు నిర్వహిస్తారు. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్ సెకండియర్‌లో నేరుగా ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఈ సెట్‌ను జూలై 13న నిర్వహించనున్నారు.
ఎంసెట్‌లో ఈ ఏడాది ఇంటర్ వెయిటేజీ ఉండదని సమాచారం. దీనిపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నది. సాధారణంగా ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇస్తున్నారు. కరోనా దృష్ట్యా నిరుడు వెయిటేజీని రద్దుచేశారు. ఎంసెట్ మా ర్కుల ఆధారంగానే ర్యాంకులను ప్రకటించారు. గత అక్టోబర్‌లో నిర్వహించిన ఫస్టియర్ పరీక్షల్లో 51% విద్యార్థులు ఫెయిలయ్యారు. వారికి 35% మార్కులేసి పాస్‌చేశారు. ఈ నేపథ్యంలో ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ అ మలుచేస్తే ఇబ్బందులు తప్పవన్న వాదనలున్నాయి.
ఎంసెట్‌కు ఇంటర్లో 70 శాతం సిలబస్సే
ఈ ఏడాది ఎంసెట్‌లో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో 70 శాతం సిలబస్‌కే ప్రశ్నలు అడుగనున్నారు. గతేడాది ఫస్టియర్‌లో 100 శాతం సిలబస్, సెకండియర్‌లో 70 శాతం సిలబస్ నుంచి ప్రశ్నలు అడిగారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం సెకండియర్ చదివే విద్యార్థులకు ఫస్టియర్‌తోపాటు సెకండియర్‌లోనూ 70 శాతం సిలబసే బోధించడంతో అధికారులు ఈ మార్పు చేశారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

