అగ్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ సంస్థ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రోమాంచకం’. సుమంత్ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మాత. సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ వేగం పెంచారు. బుధవారం టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘ఈ లోకం ఎంతో కొత్తగా, మారిపోయే ఈ దినం, లోకంలో ఉందీ కేవలం నువ్వు నేను ఇద్దరం, గడియారం లేని సమయాలు, కొలమానం లేని సరదాలు, అంతా మనకు సొంతాలు’ అంటూ చంద్రబోస్ రచించిన ఈ పాటకు వాసుకీ వైభవ్ స్వరాల్ని అందించారు. మెలోడీ ప్రధానంగా ఈ పాట సాగింది. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలబోసిన కథాంశమిదని మేకర్స్ తెలిపారు.