Srisailam | ఉభయ తెలుగురాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకున్నారు. వీరితోపాటు మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, తుడి మేగారెడ్డి దర్శించుకున్నారు.
సోమవారం మధ్యాహ్నం క్షేత్రానికి చేరుకున్న వీరికి ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో అధికారులు, వేద పండితులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం అమ్మవారి ప్రాకార మండపంలో వేదాశీర్వచనం చేసి తీర్ఠప్రసాదాలు అందించారు.
Samsung Galaxy S24 Ultra | టైటానియం ఎల్లో కలర్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా.. ఇవీ డిటైల్స్..!
SBI | ఈ ఏడాది కొత్తగా 400 శాఖలు ప్రారంభిస్తాం.. తేల్చేసిన ఎస్బీఐ చైర్మన్ ఖరా..!
Citroen C3 Aircross | సిట్రోన్ బంపరాఫర్.. సీ3 ఎయిర్ క్రాస్‌పై రూ.2.62 లక్షల వరకూ డిస్కౌంట్..!