హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా ఎదురుకాల్పుల ఘటనలో విషపదార్థాలు ప్రయోగించారనేది ముమ్మాటికీ దుష్ప్రచారమని డీజీపీ డాక్టర్ జితేందర్ పేర్కొన్నారు. ఆ ఎన్కౌంటర్లో విషపదార్థాలు ప్రయోగించి మావోయిస్టులు స్పృహ కోల్పోయిన తర్వాత కాల్పులు జరిపారని తెలంగాణ రాష్ట్ర పౌర హకుల సంఘం చేస్తున్న ఆరోపణలను డీజీపీ ఖండించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎన్కౌంటర్లను ఆపాలని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ డిమాండ్ చేశారు. ప్రజా ప్రభుత్వం పేరుతో ఏర్పడిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్కౌంటర్లు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్కౌంటర్ మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అందజేయాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.