హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో రా ణించాలంటే ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకోవాలని డీజీపీ జితేందర్ పోలీస్ అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అసిస్టెంట్ ఎస్పీలు, ట్రైనీ అసిస్టెంట్ ఎస్పీల పనితీరును తన కార్యాలయంలో ఆయన సమీక్షించారు. పోలీస్‌శాఖ ద్వారా ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ బేసిక్ పోలీసింగ్‌ను మర్చిపోవద్దని సూచించారు.
మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల అడిషనల్ డీజీ మహేశ్ ఎం భగవత్, ఐజీలు చంద్రశేఖర్‌రెడ్డి, వీ సత్యనారాయణ, శాంతిభద్రతల ఏఐజీ రమణకుమార్, అసిస్టెంట్ ఎస్పీలు బీ చైతన్య, ఆర్ రాహుల్‌రెడ్డి, కాజల్, అవినాష్‌కుమార్, శివ ఉపాధ్యాయ, చేతం నితిన్, శుభం, పీ మౌనిక, శేషాద్రినిరెడ్డి, వసుంధరయాదవ్ తదితరులు పాల్గొన్నారు.