ఆ ముగ్గురు ఎవరు?.. పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున చర్చ
డీజీపీ సీవీ ఆనంద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆ శాఖలోనే తీవ్ర చర్చకు తెరలేపాయి. ఇటీవల వరంగల్ పర్యటన లో ఆయన చేసిన వ్యాఖ్యలు పలువురు అ వినీతి అధికారుల్లో గుబులు రేపింది.
- డీజీపీ సీవీ ఆనంద్ చెప్పిన ఆ నలుగురిలో ఒకరి అటాచ్
- మిగతా ముగ్గురిలో ఒక సీపీ, ఇద్దరు జిల్లాల ఎస్పీలున్నట్టు పోలీస్ వర్గాల్లోనే గుసగుసలు
- త్వరలో వీరిపై వేటు తప్పదని అనుమానాలు
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): డీజీపీ సీవీ ఆనంద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆ శాఖలోనే తీవ్ర చర్చకు తెరలేపాయి. ఇటీవల వరంగల్ పర్యటన లో ఆయన చేసిన వ్యాఖ్యలు పలువురు అ వినీతి అధికారుల్లో గుబులు రేపింది. పోలీ స్ శాఖలో ఓ నలుగురు ఐపీఎస్ అధికారుల ప్రవర్తన సరిగా లేదని, వారి తీరుపై చర్య లు తప్పవని డీజీపీ హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలు చేసిన రెండ్రోజులకే అవినీతి ఆరోపణలున్న డీఐజీని డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేయడం సంచలనంగా మారింది. దీంతో డీజీపీ చెప్పిన నలుగురిలో మిగతా ముగ్గురు ఎవరై ఉంటారు? అన్న చర్చ పోలీస్ వర్గాల్లో, మీడియాలో, ప్రజల్లోనూ తీవ్రంగా జరుగుతున్నది.
అక్రమాలకు పా ల్పడుతున్న పలువురు ఐపీఎస్‌లు, వివిధ జిల్లాల ఎస్పీల పేర్లు వెలుగులోకి వస్తున్నా యి. పలువురు ఐపీఎస్‌లు, ఎస్పీలకు వారి పరిధిలో జరుగుతున్న నేరాలు, భారీ దోపిడీపై డీజీపీ నుంచి, ఇంటెలిజెన్స్ నుంచి హెచ్చరికలు వెళ్తున్నా కూడా తీరు మార డం లేదని సమాచారం. వీరికి స్థానికంగా రాజకీయ నేతల పలుకుబడి ఉండటంతో మరింత రెచ్చిపోతున్నారని తెలిసింది. ప లువురికి సాక్షాతూ మంత్రుల నుంచే అండదండలు ఉండటంతో పలు వీడియో కాన్ఫరెన్స్‌లలో డీజీపీ చెప్పే పనులనూ చేయడం లేదని సమాచారం. దీంతో డీజీపీయే స్వ యంగా ఆ అధికారుల తీరును మీడియా ముందు ప్రస్తావించారని చెప్తున్నారు.
ఆ ముగ్గురు వీరేనా?
డీజీపీ సీవీ ఆనంద్ చెప్పిన ఆ నలుగురి లో మిగతా ముగ్గురిపై త్వరలో వేటు తప్పదని అంటున్నారు. ఆ జాబితాలో ఒక సీపీ, ఇద్దరు ఎస్పీలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. దక్షిణ తెలంగాణకు చెందిన ఓ సీపీ చాలా కాలంగానే ఒకేచోట పనిస్తుండ టం, ఆ ఉమ్మడి జిల్లా పరిధిలోని మంత్రు ల అండదండలు ఆయనకు దండిగా ఉన్న ట్టు సమాచారం. పోలీస్ శాఖ రివ్యూలకు సైతం ఆయన సరిగా స్పందించడం లేదని తెలిసింది. దీనికి తోడు ఆ ఉమ్మడి జిల్లాకు ఆనుకొని ఉన్న ఓ ఎస్పీపై కూడా ఆరోపణ లు ఉన్నాయి. వీరికితోడు ఉమ్మడి పాలమూరుకు చెందిన ఓ ఎస్పీపైనా ఇవే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ఎస్పీకి కూడా ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉండటం తో విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే చర్చ జరుగుతున్నది. వారిపై వేటు వేస్తారా? లేక డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలతోనే సరిపెడుతారా? అన్న చర్చ కూడా సాగుతున్నది. డీజీపీ వ్యాఖ్యలు పోలీస్ శాఖలో తీర్చ చర్చకు దారితీయడంతో పాటు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

