యాదాద్రి: తమిళనాడులోని అరుణాచలేశ్వర స్వామి (Arunachalam) గిరి ప్రదక్షిణకు వెళ్లిన తెలంగాణ భక్తుడు హత్యకు గురయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌కు చెందిన చిప్పలపల్లి విద్యాసాగర్ (32) అరుణాచలం వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు విద్యాసాగర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో అతడు కిందపడిపోగా స్వల్పగాయాలయ్యాయి. దీంతో వారితో వాగ్వాదానికి దిగారు.
కోపంతో ఊగిపోయిన యువకులు తమ వద్ద ఉన్న కత్తితో విద్యాసాగర్‌పై దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్‌ను తోటి భక్తులు దవాఖానకు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు తిరువణ్ణామలైకి చెందిన గుగనేశ్వరన్ (22), తమిళరసన్ (25)ను అరెస్టు చేశారు.