హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు రాష్ర్టానికే పరిమితం కాలేదు. విదేశాల్లోనూ వైభవంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ యూఎస్ఏ సలహా మండలి బోర్డు చైర్మన్ తన్నీరు మహేశ్ నాయకత్వంలో అమెరికాలోని 25 నగరాల్లో దశాబ్ది ఉత్సవాలను వేడుకలా నిర్వహించారు. కొలంబస్లో నిర్వహించిన ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ బాల్యమిత్రుడు ఉమారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమెరికాలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించినందుకు ఆనందంగా ఉందని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. టె క్సాస్ రాష్ట్రం నుంచి ఫ్లోరిడా వరకు దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బే ఏరియా, డాలస్, సిన్సినాటి, ఆస్టిన్ల్, లాస్ఏంజెల్స్, న్యూ జెర్సీ, వాషింగ్టన్ డీసీ, డెట్రాయిట్, కాన్సాస్డ్, చికాగో, శాక్రమెంటో తదితర 25 అమెరికా నగరాల్లో ఉత్సవాలు నిర్వహించారు. బీఆర్ఎస్ మలేసి యా అధ్యక్షుడు చిట్టిబాబు ఆధ్వర్యంలో మలేసియాలోనూ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు.