నర్సంపేట, జనవరి 21 : హామీల అమలుపై కాంగ్రెస్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధిలేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను సర్కార్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు నిలదీస్తారనే భయంతో పునాది రాళ్ల పేరుమీద వందల చోట్ల గుర్తింపులేని పనుల శిలాఫలకాలను వేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నర్సంపేట మున్సిపల్ అభివృద్ధి కోసం పూర్తిస్థాయి సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు తీసుకొచ్చినట్టు తెలిపారు.