హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీలో సిల్ డెవలప్మెంట్పై సమావేశమయ్యారు. ఈ నెల 23 లోపే అవసరమైన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులన్నీ తయా రు చేసేందుకు ఆ రంగంలో నిపుణులైన ఒక కన్సల్టెంట్‌ను నియమించుకోవాలని సూచించారు. యూనివర్సిటీ వ్యవహారాలకు పరిశ్రమలశాఖ నోడల్ డిపార్టుమెంట్‌గా వ్యవహరిస్తుందని అన్నారు. ఐఎస్బీ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చర్చ జరగగా.. హాజరైన ప్రతినిధులందరినీ తాతాలిక బోర్డుగా భావించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఏమేం కోర్సులుండాలి? ఎలాంటి పాఠ్యాంశాలు ఉండాలి? పరిశ్రమల అవసరాలు తెలుసుకొని వాటికి అనుగుణంగా యువతకు ఉద్యోగ అవకాశాలు ఉండేందుకు ఏయే నైపుణ్యాలపై కోర్సులు నిర్వహించాలనేది అధ్యయనం చేయాలని సూచించారు.
అధునాతన పరిజ్ఞానం అందించేలా సిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, కరిక్యులమ్, కోర్సులకు సంబంధించి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో చర్చించాలని వెల్లడించారు. 5 రోజులకోసారి సమావేశం కావాలని దిశానిర్దేశం చేశారు. వర్సిటీని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలా? పీపీపీ పద్ధతి పాటించాలా? అనేది కూడా పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్‌రంజన్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి, ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్కీ డైరెక్టర్ రామేశ్వర్రావు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ చైర్మన్ సతీశ్‌రెడ్డి, భారత్ బయోటెక్ హరిప్రసాద్, క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్‌రెడ్డి, ఐ ల్యాబ్స్ శ్రీనిరాజు పాల్గొన్నారు.