హైదరాబాద్, మార్చి 5(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు అవకాశం చిక్కిన ప్రతిసారీ ప్రధాన మంత్రి దృష్టిలో పడేందుకు తాపత్రయపడుతున్నారు. మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ర్టానికి రాగా ఆయన వెన్నంటే ఉన్నా రు. మోదీ మంగళవారం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న వీడియోను ఎక్స్‌లో సీఎం రీట్వీట్ చేసి మోదీపై భక్తిని మరోసారి చాటుకున్నారు. దీనిపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ‘పెద్దన్న-చిన్నన్నల బంధం ఎంత గాఢంగా ఉందో చూడండి. ఇది బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉన్న రహస్య బంధాన్ని తెలియజేస్తున్నది. మీ రాజకీయాలతో తెలంగాణను నాశనం చేయొద్దు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెటిజన్లు కూడా రేవంత్ తీరుపై సెటైర్లు వేస్తున్నారు.