Padi Kaushik Reddy : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు లక్షల పిచ్చి కుక్కలు ఉన్నాయని, ఆ పిచ్చి కుక్కల అధ్యక్షుడే రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతోందని విమర్శించారు. మా పొలం ఎండిపోతుంటే ట్యాంకర్‌తో నీళ్ళు పెడుతున్నామని ఓ పసివాడు చెబుతున్నాడని, ఒకవైపు నెలకు నాలుగు వేల పెన్షన్ వస్తుంటే మరోవైపు 4 ఎకరాల పంట ఎండిపోతుందని ఆ పసివాడు చెబుతుంటే గుండె తరుక్కుపోతోందని పాడి ఆవేదన వ్యక్తం చేశారు.
పంటలు ఎండిపోతుంటే కనీసం నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, కేసీఆర్ హయాంలో వచ్చిన కరెంటు, రైతుబందు ఎందుకు రావడం లేదని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ మీద ఉన్న కసితోనే పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతోందని ఆరోపించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, నీళ్లు వదలకపోతే రైతులను తీసుకొని తాను రొడ్డెక్కుతానని హెచ్చరించారు. కేసీఆర్ కంటే గొప్ప పాలన చేసే ప్రయత్నం చేయాలిగానీ ఇలాంటి పరిస్థితులు రాకూడదని, 15 నెలల స్కాంగ్రెస్ పాలనలో 15 స్కాములు జరిగాయని ఆరోపించారు.
ఈ స్కాంగ్రెస్ పాపాలను ప్రజలు గమనిస్తున్నారని, ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరును ప్రజలు చూస్తున్నారని పాడి అన్నారు. తెలంగాణ సాధనే కేసీఆర్‌కు కొండంత పేరు తెచ్చిందని, పైగా 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ అభివృద్ధిని దేశానికి చూపెట్టారని కొనియాడారు.
సిగ్గు శరం లేకుండా రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత చావు కోరుతున్నాడని, ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రతిపక్ష చావును కోరుకోలేదని మండిపడ్డారు. మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయని, కొండను చూసి కుక్కలు మొరిగితే కొండకు చేటా అని ప్రశ్నించారు.
కేసీఆర్ చావాలని నువ్వు కోరుకుంటున్నావు కానీ కేసీఆర్ చచ్చే వ్యక్తి కాదని, చావు నోట్లో తలపెట్టి తెలంగాణను తెచ్చిన వ్యక్తి అని పాడి పొగిడారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా, ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేవాడా అని ప్రశ్నించారు. నీకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అనే విషయం గుర్తుపెట్టుకో అన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. ప్రజలు పెడుతున్న శాపనార్థాలకు కుక్క చావు చచ్చేది రేవంత్ రెడ్డేనని వ్యాఖ్యానించారు. రైతులు రైతుబంధు రాలేదని, రుణమాఫీ కాలేదని, నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని ఒక జర్నలిస్టుకి ఇంటర్వ్యూ ఇస్తే.. ఆ జర్నలిస్టును బెయిల్ రాకుండా కేసులు పెట్టి జైలుకు పంపించారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు.